అనంతపురం/ పామిడి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీబీ) మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు లిఖిత, చైతన్య మిత్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
3 కిలో మీటర్లు.. 35 నిమిషాలు
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కల్లూరులో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పామిడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది. వైఎస్ జగన్ ఉదయం 11:10గంటలకు హెలికాప్టర్‌లో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిసెప్షన్ వేదిక వద్దకు బయల్దేరారు. వైఎస్ జగన్ కారుమీద నిలబడి ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన సందోహం నడుమ కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితితో 35 నిమిషాల సేపు ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. పామిడిలో భవనాలు, మిద్దెలు ఎక్కిన ప్రజలు .. జగన్‌ను చూసి మురిసిపోయారు. జాతీయ రహదారి–44 జనంతో నిండిపోయింది. అన్ని దారులూ పామిడి వైపే అన్నట్లు.. జన సందోహం వెళ్లింది. ఉదయం 7 గంటలకే హెలిప్యాడ్ వద్దకు జనం చేరుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు వేచి ఉన్నారు.
అడుగడుగునా నీరాజనం
పామిడి వీరాంజనేయులు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోగానే అక్కడి పరిసరాలు జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. వైఎస్ జగన్‌తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12.20 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయల్దేరారు.
ఆత్మీయ స్వాగతం
హెలిప్యాడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకరనారాయణ, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాప్తాడు, తాడిపత్రి, మడకశిర, రాయదుర్గం సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఈరలక్కప్ప, మెట్టు గోవిందరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిశీలకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతీరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ వసీం, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
పామిడిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
ఏడీసీసీబీ మాజీ చైర్‌పర్సన్ లిఖిత వివాహ రిసెప్షన్‌కు హాజరు
జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
హెలిప్యాడ్ నుంచి పామిడి వీరా ఇంటి వరకు నీరాజనమే
అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మాజీ ముఖ్యమంత్రి


