లోటుపాట్లు లేకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

లోటుపాట్లు లేకుండా చూడండి

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

పుట్టపర్తి టౌన్‌: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సీఎం చంద్రబాబు ఈనెల 15న పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ సతీష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, ఇతర శాఖల అధికారులతో కలసి బ్రాహ్మణపల్లి వద్ద సభా వేదికను పరిశీలించారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయం, సభా ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలు, విద్యుత్‌ పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం సభా ప్రాంతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భద్రత పరంగా ఎలాంటి లోటు పాట్లు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

పుట్టపర్తి టౌన్‌: కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పుట్టపర్తి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పోలీస్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్‌ హాల్లో సీఎం బందోబస్త్‌ సెక్టార్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం సభా వేదిక పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement