రమణీయం.. నృసింహుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. నృసింహుడి రథోత్సవం

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

ఉరవకొండ : పెన్నహోబిలం క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నమో నారసింహ నామం మార్మోగింది. రథోత్సవం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తెచ్చి మహా రథంలో కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. అశేష భక్త జనం నడుమ బ్రహ్మ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మ రథోత్సంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్‌ పట్టువస్త్రాలను సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement