‘ఐఎంఏ’ను మరింత అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

‘ఐఎంఏ’ను మరింత అభివృద్ధి చేస్తాం

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

ధర్మవరం రూరల్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సేవలను మరింత అభివృద్ధి చేస్తామని ఏపీ ఐఎంఏ అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. ఆదివారం ధర్మవరం పట్టణంలోని ఐఎంఏ పనితీరును, వారు చేస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం వారు పట్ట్టణంలో ఐఎంఏ చేస్తున్న సేవలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌బీఐ కాలనీలోని డాక్టర్‌ నరసింహులతో వారు పలు విషయాలపై చర్చించారు. త్వరలో పుట్టపర్తి రోడ్డులో నిర్మించనున్న ఐఎంఏ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐఎంఏ కార్యదర్శి వరుణ్‌కుమార్‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ సభ్యులు నరసింహులు, స్థానిక ఐఎంఏ సభ్యులు సుధాకర్‌, వాసుదేవరెడ్డి, వెంకటరామిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పద్మ, కుమార్‌బాబు, జగదీష్‌, విక్రాంత్‌, నజీర్‌, హరి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయభాస్కర్‌ మృతిపై విచారణ జరపాలి

మడకశిర: దళిత యువకుడు విజయభాస్కర్‌ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు అధ్యక్షత వహించారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో గుడిబండ మండలం మందలపల్లికి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్‌ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన అంశంపై చర్చించారు. విజయభాస్కర్‌ను హత్య చేశారని, హత్య కేసు నమోదు చేసి హంతకులను అరెస్ట్‌ చేయాలని నాయకులు పెద్ద ఎత్తున మడకశిరలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినా ఇంత వరకు విజయభాస్కర్‌ మృతి మిస్టరీ వీడ లేదు. దీంతో దళిత సంఘాల నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి విజయభాస్కర్‌ మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు తిప్పేస్వామి, ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్‌ సాకే హరి, ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప, బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ విజయభాస్కర్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, న్యాయవాది గోపాలకృష్ణ, దళిత సంఘాల నాయకులు కుళ్లాయప్ప, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement