ఏడాదిగా తిప్పుతున్నారు | - | Sakshi
Sakshi News home page

ఏడాదిగా తిప్పుతున్నారు

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

నా భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన పేరుమీద ఉన్న పాసుబుక్కు నా పేరుమీద మార్చాలని ఏడాదిగా తిరుగుతున్నా. మాకు 6 ఎకరాలంటే కేవలం 4 ఎకరాలు మాత్రం 1–బీలో ఎక్కించారు. కానీ పాసుబుక్కు మాత్రం ఇవ్వలేదు. మిగిలిన రెండెకరాలు 1–బీలో కూడా నమోదు చేయలేదు. బ్యాంకులో అప్పు తీసుకుందామని పోతే పాసుబుక్కు అడుగుతున్నారు. – శ్యామలమ్మ,

పులిమివాండ్లపల్లి, నల్లచెరువు మండలం

రైతుల ఉసురు తగలక తప్పదు

ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ క్యూఆర్‌ కోడ్‌తో ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పాసుపుస్తకం ఇచ్చింది. దానిపై జగన్‌ ఫొటో ఉందనే ఒకే ఒక్క కారణంతో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రీ సర్వే విషయంలో గగ్గోలు చేసిన చంద్రబాబు.. చివరకు జగన్‌ను అనుసరించక తప్పలేదు. –ఉషశ్రీ చరణ్‌,

జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్‌ సీపీ

ప్రతి రైతుకు ఇస్తాం

రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటికే పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశాం. తప్పులున్న వాటిని సరిదిద్దేందుకు కొన్నిచోట్ల వెనక్కు తీసుకున్నాం. కొత్త పాసుపుస్తకాలు చైన్నెలో ప్రింట్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే రైతులకు అందజేస్తాం. భూమి ఉన్న ప్రతి రైతుకూ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తాం.

– మౌర్య భరద్వాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement