దూసుకెళ్లిన శ్రీరామ్‌ కాన్వాయ్‌.. టీడీపీ కార్యకర్తకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన శ్రీరామ్‌ కాన్వాయ్‌.. టీడీపీ కార్యకర్తకు గాయాలు

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

బత్తలపల్లి: మంత్రి నారా లోకేష్‌ బత్తలపల్లి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం మంత్రి వస్తున్నట్లుగా తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బత్తలపల్లిలోని కూడలికి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ కాన్వాయ్‌ వచ్చింది. ఆ సమయంలో కార్యకర్తలు తోసుకోవడంతో తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగార్జున పాదంపై కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లింది. క్షతగాత్రుడిని అక్కడున్న వారు ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చేతులు ఎత్తేశారు. అతని బాగోగులు పట్టించుకోకపోవడంతో నొప్పి తాళలేక విలవిల్లాడాడు. తనను ఎవరూ పట్టించుకోలేదంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement