ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన వడ్డె కిష్టప్ప, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్‌ (15) ఈతకని వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. గుంతకల్లులోని ప్రైవేట్‌ పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని, వేసవి సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ శివారున ఉన్న బావిలోకి ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి చేరుకున్న ప్రవీణ్‌ అక్కడే పూడికలో ఇరుక్కుపోయాడు. ఎంత సేపటికీ బయలకు రాకపోవడంతో కంగారు పడిన స్నేహితుల సమాచారంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే బావిలో దిగి బాలుడిని వెలికి తీసి ఆగమేఘాలపై మాజీ ఎంపీపీ రామచంద్ర ద్విచక్ర వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రవీణ్‌ (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement