ప్రజలకు పెట్రో ‘వాత’ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పెట్రో ‘వాత’

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

పెట్రల్‌, డీజిల్‌ ధర లీటర్‌పై రూ.3 పెంపు

వినియోగదారుల జేబుకు చిల్లు

నెలసరి భారం రూ.5.59 కోట్లు

అనంతపురం అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పెట్రో ‘వాత’ పెట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంచనుందనే విషయాన్ని ‘సాక్షి’లో గతనెల 27న ప్రచురితమైన ‘తీవ్రమైన పెట్రోల్‌ కష్టాలు’ కథనం ద్వారా తెలియజేసింది. ఇప్పుడు అదే జరిగింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.30, లీటర్‌ డీజిల్‌పై రూ.3.14 పెంచింది. ధరల పెంపుతో జిల్లా పెట్రోల్‌, డీజిల్‌ వినియోదారులపై రోజువారీగా రూ.19.10 లక్షలుగా నెలసరి రూ.5.59 కోట్లు ఆర్థిక భారం పడనుంది.

ధర పెంపు తీవ్రభారం

ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపు భారం ఆ వర్గాలపై తీవ్రంగా మారింది. జిల్లావ్యాప్తంగా 188 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. రోజువారీగా పెట్రోల్‌ 2.50 లక్షల లీటర్లు, డీజిల్‌ 3.72 లక్షల లీటర్లు వినియోగం ఉంది. పెట్రోల్‌పై రూ.3 పెంచడతో వినియోగదారులపై రోజువారీగా రూ.7.50 లక్షలుగా నెలసరి రూ.2.25 కోట్లు భారం పడనుంది. ఇక డీజిల్‌పై రూ.3 పెంచడంతో వినియోగదారులపై రోజువారీగా రూ.11.16 లక్షలుగా నెలసరి రూ.3.348 కోట్లు భారం పడనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపుతో ప్రజల జేబుకు రోజువారీగా రూ.19.10 లక్షలుగా నెలసరి రూ. 5.598 కోట్లు చిల్లుపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement