కోర్టు ప్రాంగణంలో రెండు రోజులు ఉండాలని శిక్ష | - | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రాంగణంలో రెండు రోజులు ఉండాలని శిక్ష

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

తాడిపత్రి రూరల్‌: రెండు రోజుల పాటు కోర్టు ప్రాంగణంలో ఉండాలని జూదరులకు శిక్ష విధిస్తూ తాడిపత్రి సెకండ్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ప్రభావతి తీర్పు వెలువరించారు. వివరాలను అప్‌గ్రేడ్‌ పీఎస్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సమీపంలో పేకాట ఆడుతూ పట్టుపడిన 11మందిని శుక్రవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసు విచారణ అనంతరం జూదరులు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా, రెండు రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

బూదివర్తిలో వడగండ్ల వాన

బెళుగుప్ప: మండలంలోని బూదివర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పెను గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. గ్రామస్తులు వడగండ్లను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. గ్రామం సమీపంలోని పొలాల్లో కురిసిన వడగళ్లు ముత్యాల మాదిరిగా మిలమిల మెరుస్తూ కనిపించాయి.

Advertisement
 
Advertisement
Advertisement