విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో లక్షలాది మంది నీట్‌ పరీక్ష రాస్తే ఆ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నిర్వహణలో ఎన్‌టీఏ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత, సమన్వయం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరీక్ష రద్దుతో లక్షల కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి ఏడాది పేపర్‌ లీక్‌ ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. పరీక్ష లీక్‌కు సంబంధించి ఇంత వరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. కేవలం పరిపాలనా లోపం కాదని ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. – శెట్టిపి జయచంద్రారెడ్డి,

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement