ధర్మవరం అర్బన్: స్థానిక జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన రేషం వ్యాపారి పూజారి రాఘవ(35) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ యాత్రకు వెళ్లిన రాఘవ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. నాలుగురోజుల క్రితం రైలు కర్ణాటకకు చేరుకోగానే రాఘవ కనిపించలేదు. రైలు మొత్తం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ధర్మవరానికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని రాయచూర్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న రాఘవ కుటుంబ సభ్యులు రాయచూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.


