చిలమత్తూరు: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను వెంటనే ఆపాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్ మింటు, నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షుడు బాలును అధికార పార్టీ నేతలు కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హిందూపురం అంబేడ్కర్ కూడలి వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉండే నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు మనేసముద్రం గిరీష్‌కుమార్, శంకరయ్య, లోకేష్,రామాంజినేయులు, శ్రీరాములు, నరసింహమూర్తి, ప్రణయ్‌రెడ్డి, కొటిపి శ్రీనివాసరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్: ఏపీఆర్‌జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. వి.మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్‌రెడ్డి, విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందించారు.


