కవి మాణిక్యం ఇషాక్‌కు సింగపూర్‌లో సన్మానం | - | Sakshi
Sakshi News home page

కవి మాణిక్యం ఇషాక్‌కు సింగపూర్‌లో సన్మానం

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

పుట్టపర్తి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కవి మాణిక్యం ఇషాక్‌కు సింగపూర్‌లో ఘన సన్మానం లభించింది. సింగపూర్‌ విద్య అధ్యయనంపై ఈ నెల 2న పలువురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. ముగింపు రోజున సింగపూర్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ఐఈ)లో జరిగిన కార్యక్రమంలో తాను రాసిన ‘మాణిక్య శతకం’ పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఆవిష్కరింపజేశారు. ఇషాక్‌ రాసిన పాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయనతో పాటు ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ వెంకటకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన 37 మంది ఉపాధ్యాయులతో పాటు ఎస్‌సీఈఆర్టీ అధికారులు వెంకటరమణ, మహేశ్వర్‌రెడ్డి, జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు జాబిలి చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement