అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 53 గ్రామపంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం (వాల్టా–2002) అమలు చేయనున్నారు. ఈ పంచాయతీల పరిధిలో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో తాగునీటి అవవసరాల కోసం మాత్రమే బోరుబావుల తవ్వకం చేయాలంటూ జీఓలో పేర్కొన్నారు. వాల్టా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో అత్యధికంగా భూగర్భజలాలు, నీటి వినియోగం (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో 258 గ్రామ పంచా యతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు ఉండగా.. శ్రీకాకుళంలో 76, శ్రీసత్యసాయి జిల్లాలో 39, పల్నాడులో 20, అనంతపురంలో 14, వైఎస్సార్ కడపలో 10, చిత్తూరు జిల్లాలో 8 చొప్పున మొత్తం 258 గ్రామ పంచాయతీల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లా పరిధిలో గ్రామాలివే...
అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి,నరసాంబూది, పి.బ్యాడిగెర, అమడగూరు మండలం కర్ణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, చిలమత్తూరు మండలం హుస్సేనాపురం, గాండ్లపెంట మండలం సామచేనుబైలు, చామాలగొంది, గాండ్లపెంట–1, జీనులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుల పల్లి–1, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె–2, కిరికెర, కొట్నూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి,కాకి,ఎం.రాయాపురం, రొళ్ల–1, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం–1, బొంతలపల్లె, చీకటిమానిపల్లి, దిగువమందలపల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుం గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి చేర్చారు.
కొత్తగా బోరుబావుల తవ్వకం నిషేధం
శ్రీసత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు


