చింతపండు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలి. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. రవాణా ఖర్చులను రూ.వేలల్లో భరించాల్సి వస్తోంది. చింతపండు రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈఏడాది దిగుబడి తగ్గి నష్టపోయాం. ఉత్పత్తి వ్యయం పెరిగి ఆర్థికంగా నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుని స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పిస్తే కొంత వరకు ఆర్థిక భారం తగ్గుతుంది.
– గోవిందరాజులు, గుడ్డగుర్కి, రొళ్ల మండలం


