అదనపు అతిథి గృహం ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

అదనపు అతిథి గృహం ఏర్పాటు చేయండి

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అదనపు అతిథి గృహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజయవాడలో సోమవారం జరిగిన టూరిజం సమావేశంలో టూరిజం డైరెక్టర్‌ జయప్ప సూచించారు. ప్రస్తుతమున్న అతిథి గృహంలోని 10 గదులు పర్యాటకులకు సరిపోవని, దీంతో పర్యాటకులు హిందూపురం, బాగేపల్లి ప్రాంతాలకు వెళ్లి బస చేస్తున్నారని వివరించారు. మరో 10 గదులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎనిమిది గదుల నిర్మాణానికి నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై డైరెక్టర్‌ జయప్ప మాట్లాడుతూ.. పక్కనే నంది విగ్రహం ఉండడంతో గదుల నిర్మాణానికి పురావస్తు శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. అయితే టూరిజం గెస్ట్‌ హౌస్‌ వెనుక భాగంలో అదనపు గెస్ట్‌ హౌస్‌ నిర్మించేందుకు అనువైన స్థలం ఉందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్‌ డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. త్వరలో స్థలాన్ని పరిశీలించి పర్యాటకులకు అనుకూలంగా మంచి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో ఈడీ పద్యావతి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

పర్యాటక శాఖ చైర్మన్‌కు ౖ

డెరెక్టర్‌ జయప్ప వినతి

Advertisement
 
Advertisement
Advertisement