తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వొద్దు

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

పుట్టపర్తి టౌన్‌: తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వకుండా విద్యార్థులు కష్టపడి చదవాలని ఆర్టీఓ సువర్ణ సూచించారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్‌ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాల సామాజికవర్గానికి చెందిన విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమానికి ఆర్డీఓ సువర్ణ, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కోట్ల గంగాధర్‌, ఉపాధ్యక్షుడు జూటూరు మహేంద్ర, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చదువుతోనే దేనినైనా సాధించవచ్చన్నారు. చిన్నతనంలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అంబేడ్కర్‌ కలలు గన్న సమాజ నిర్మాణానికి విద్య ఏకై క మార్గమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు మూర్తి, రామాంజనేయులు, చెరుకూరి గంగులయ్య, గోవిందు, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, మనోహర్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్డీఓ సువర్ణ సూచన

Advertisement
 
Advertisement
Advertisement