భక్తిశ్రద్ధలతో గంగమ్మకు జ్యోతులు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గంగమ్మకు జ్యోతులు

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

గాండ్లపెంట: మండల కేంద్రమైన గాండ్లపెంటలో గంగమ్మ తిరునాల వైభవంగా ముగిసింది. మూడోరోజు భక్తులు అమ్మవారికి బోనాలు, జ్యోతులను సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు.

ఉత్సాహంగా ఉట్ల తిరునాల

ఆలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ఉట్ల తిరునాల నిర్వహించారు. ఉట్టిని అందుకునేందుకు యువకులు బృందాలుగా ఏర్పడి పోటీపడ్డారు. చివరకు నాయనివారిపల్లికి చెందిన యువకుల బృందం ఉట్టిని అందుకుంది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన గంగమ్మ తిరునాల ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement