కదిరి అర్బన్: మండల పరిధిలోని పట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2007–08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. తమకు పాఠాలు నేర్పిన గురువులను శాలువలు, పూలమాలలతో పూర్వ విద్యార్థులు సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఓడీ చెరువులో..
ఓడీచెరువు: ఓడీచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989–90 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 36 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. పాఠశాల ప్రాంగణంలో ఆటల పోటీలతో మైమరిచిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు అందుబాటులో లేకపోవడంతో వారిని ఫోన్‌లో పలకరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బొడ్డు నాగరాజు, అదే పాఠశాలలో ప్రస్తుతం పీడీగా పనిచేస్తున్న గోపినాథ్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గౌడ్, మామిళ్లకుంట్లపల్లికి చెందిన రామస్వామిరెడ్డి, మమత, రవీంద్రరెడ్డి, సుధాకర్, బాలరాజు, ఇనగలూరు లక్ష్మన్న, రామకృష్ణ, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు


