సబ్సిడీ ట్రాక్టర్ల పథకం కోసం రైతులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే చందబ్రాబు ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా పథకం అమలుకు అలవిగాని నిబంధనలు పెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడిగిన వారందరికీ సబ్సిడీతో ట్రాక్టర్లు మంజూరు చేసింది. ట్రాక్టర్ పంపిణీ చేసే రోజే సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ ప్రస్తుత నిబంధనల పేరుతో అర్హులకు అందకుండా చేస్తున్నారు. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి
నిబంధనల మేరకు మంజూరు
ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు అందజేస్తాం. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే లాటరీ తీసి జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే నెల చివరి నాటికి యంత్రాలు అందజేసినా సబ్సిడీ మొత్తం జూలై నెలలో అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
– కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి


