కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ రద్దు

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

టన్ను మామిడి రూ.35 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో ఆదివారంం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.35 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 40 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే హిమాయత్‌ రకం టన్ను గరిష్టంగా రూ.27 వేలు, కనిష్టంగా రూ.9 వేలు, సరాసరిన రూ.18 వేలు, మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ వెల్లడించారు.

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ధర్మవరం అర్బన్‌: జాతీయస్థాయిలో జరిగే బాస్కెట్‌బాల్‌ పోటీలకు విద్యార్థిని కిరణ్మయి ఎంపికై నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అసోసియేట్‌ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకూ పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగే 76వ నేషనల్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టుకు కిరణ్మయి ఎంపికై ందని పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో ఈనెల 20 వరకూ జరిగే కోచింగ్‌ క్యాంపునకు విద్యార్థిని వెళ్తోందని చెప్పారు. జాతీయస్థాయిలో జరిగే పోటీల్లోనూ కిరణ్మయి ప్రతిభ చూపి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ధర్మాంబ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్‌బాల్‌ విజేత

పశ్చిమ గోదావరి జట్టు

కదిరి అర్బన్‌: పట్టణంలోని ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ జూనియర్‌ బాలికలు, బాలుర చాంపియన్‌ షిప్‌ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్‌ ట్రోఫీని బహూకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement