పెనుకొండ:(సోమందేపల్లి): అధికారుల పర్యవేక్షణ లోపంతో హంద్రీనీవా కాలువకు గండం ఏర్పడింది. సోమందేపల్లి సమీపంలోని చాకర్లపల్లి చెరువు కుంట వద్ద హంద్రీనీవా కాలువ గట్టు కూలింది. గతంలోనే ఈ ప్రాంతంలో కాలువ దెబ్బతినగా..అప్పట్లో మట్టి తోలించి అధికారులు సరిచేశారు. అయితే తాజాగా అదే ప్రాంతంలో పెద్దఎత్తున కాలువ సైడ్ బండ్ నెర్రెలు చీలి మట్టి కిందికి పడిపోయింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్దఎత్తున ప్రమాదం చోటు చేసుకుంటుందని రైతులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కట్ట బలహీనంగా ఉండడంతో తెగిపోతే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఎన్‌హెచ్‌ఎస్‌ఎస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోకి ఎవరు రాకుండా కాలువ గట్టుపై రాళ్లు అడ్డుగా ఉంచారు.
చాకర్లపల్లి వద్ద నెర్రెలు చీలి కుంగిన వైనం


