నిరసన హోరు | - | Sakshi
Sakshi News home page

నిరసన హోరు

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

బకాయి వేతనాలు చెల్లించాలంటూ కొద్ది రోజులుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని సత్యసాయి తాగునీటి పథకం కేంద్రాల వద్ద కార్మికులు రోజుకో రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా వీరికి మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం, అధికారుల్లో చలనం రాకపోవడం సిగ్గుచేటని కార్మిక సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, సత్యసాయి బోర్డులోనే తమను కొనసాగించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. – ధర్మవరం/కదిరి అర్బన్‌/తాడిమర్రి/బత్తలపల్లి:

Advertisement
 
Advertisement
Advertisement