పామిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పామిడికి విచ్చేయనున్నారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్‌పర్సన్ ఎం. లిఖిత వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు పామిడిలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి బయల్దేరి 11.35 గంటలకు రిసెప్షన్ వేదిక వద్దకు చేరుకుంటారు. 11.50 గంటల వరకు రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులు ఎం.లిఖిత, ఎ.చైతన్యమిత్రను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పామిడి నుంచి హెలికాప్టర్‌లో తిరుగుపయనమవుతారు.
హెలీప్యాడ్ సిద్ధం
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పామిడి – కల్లూరు మార్గంలో ఉన్న పామిడి వీరా ఫంక్షన్ హాలు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు పరిశీలించారు. అలాగే పామిడి వీరాంజనేయులు గృహ సమీపంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదికను కూడా పరిశీలించారు. వారితో పాటు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, పామిడి సీఐ శివశంకర్‌నాయక్ హెలిప్యాడ్, రిసెప్షన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


