
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...
టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.
టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.
ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.
కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్‌లు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.
రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్‌జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.
ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...
కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది.
అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్‌గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది.