
నగర అధునాతన సాంకేతిక జీవనశైలిలో వేగం పెరిగిన కొద్దీ యువత ‘స్క్రీన్ టైమ్–సెంట్రిక్’ దినచర్యగా, బానిసత్వంగా మారుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజా సర్వేలు చెబుతున్న ఆందోళనకర విషయం ఏంటంటే.. నగరంతో పాటు రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో 92 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ వినియోగ పరిచయం ఉండటం. ఇందులో చదువుకోసం వాడుతున్నవారు 61 శాతం కాగా సోషల్ మీడియా బ్రౌజింగ్‌కి వెళ్తున్నవి 82.5 శాతం కావడం విశేషం. ఇది విద్యార్థుల చదువుపైనే కాకుండా దుష్పభావాలపై ఆందోళనల్ని పెంచుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మొబైల్‌తో పాటు వివిధ సాంకేతిక మాధ్యమాల స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిందని సూచిస్తున్నాయి.
నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్‌ర్యాంక్..
ఎక్కువ సమయం స్క్రీన్‌కు అతుక్కుపోవడం ఒక్క చదువుకు మాత్రమే కాదు నిద్రపట్టలేని లక్షణాన్ని కూడా గందరగోళపరుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆనందంపై ‘స్టూడెంట్ వెల్‌బీయింగ్ పల్స్’ నివేదిక చెబుతున్న తాజా వివరాల ప్రకారం.. రాత్రివేళల సోషల్ మీడియా వాడకం నిద్రను తగ్గించి, జీవన సంతృప్తిని–ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
12వ తరగతి విద్యార్థుల్లో దాదాపు 75 శాతం మందికి స్కూల్ డేస్‌లో 7 గంటల కన్నా తక్కువ నిద్రే వస్తోందట. ఇది ఆందోళనను పెంచుతూ మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్‌టైమ్‌లో ల్యాప్‌టైమ్, మొబైల్, ట్యాబ్స్ తదితర మాధ్యమాల్లో ‘పది నిమిషాలే’ అని మొదలయ్యే రీల్స్–బింజ్, నిద్రపోయే బెడ్ టైంకు ముందు ఆ స్క్రీన్‌లకు కళ్లు పెనవేసుకుని ఉండటం వల్ల నిద్రను చెడగొట్టి, మరుసటి రోజు ఫోకస్, శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.
30 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ చూశాక నిద్ర నాణ్యత తక్కువగా ఉందని ఈ డేటా చెబుతోంది. అలాగే 41 వేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలో ‘సోషల్ స్క్రోల్’ వల్ల నిద్ర ఆలస్యమవుతుందనే విషయం కూడా బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో హెల్తీ ఆన్‌లైన్ అలవాట్ల అవసరాన్ని స్పష్టంగా తెలిపే నివేదికను విడుదల చేసింది.
పరిష్కారం ఏంటి?
ఈ స్క్రీన్ టైం బానిసత్వానికి గేమింగ్ మరో పెద్ద టైమ్‌సింక్. మల్టీప్లేయర్/ఈ–స్పోర్ట్స్ మోడ్‌లో ‘నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ ర్యాంక్’ లూప్ యువతను ముంచేస్తుంది. భారతీయ పరిశోధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో గేమింగ్ అలవాట్లు.. ఫంక్షనాలిటీ, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అదే సమయంలో కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనాల్లో ‘నలుగురిలో ఒక్కడికి’ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ లక్షణాలు కనిపించాయని నివేదికలు వెల్లడించాయి.
స్క్రీన్‌పై గడిపే సమయం పెరిగేకొద్దీ మార్కులపై వస్తున్న ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే మువతలో వచ్చిన ఈ మార్పులతో పాటు డోపమైన్ హిట్స్ కోసం వేపింగ్/సబ్‌స్టెన్స్ ట్రయల్స్ వైపు అడుగులు కూడా ఆందోళనకరంగా మారాయి. తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్ బ్యూరో ప్రణాళికలే ఈ విషయాలను చెబుతున్నాయి. హైదరాబాదు పరిసరాల్లో కుర్రాళ్లలో వీటి సరఫరా సులభంగా లభించడం వంటి కారణాలు అటు వైపు నెడుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో పరిష్కార మార్గాలపై నిపుణులు, సామాజికవేత్తలు దృష్టి సారించారు. పాఠశాలలు–కాలేజీలు ‘డిజిటల్ హైజీన్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్’ను కాంబోగా ఇవ్వాలి సూచిస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్ సలహాలకంటే ఇలాంటి అంశాలపై అవగాహన కలి్పంచడం ప్రాథమిక బాధ్యత అని విన్నవిస్తున్నారు.
ఇంట్లో కూడా ‘స్క్రీన్ కర్ఫ్యూ’ (బెడ్‌టైమ్‌కు 60–90 నిమిషాల ముందు స్క్రీన్ ఆఫ్), నప్‌లిమిట్ (మధ్యాహ్నం 20–30 నిమిషాలకే), ‘నో ఫోన్ ఇన్ డైనింగ్ టేబుల్’, ‘రీల్స్‌కు రూల్ ఆఫ్ 15’ (రోజు 15 నిమిషాలకే) వంటి మైక్రో రూల్స్ అమలు చేస్తే ఫోకస్, నిద్ర, మూడ్ మెరుగుపడతాయని, నిద్ర–మానసిక అంశాలకు చెందిన ఆరోగ్య డేటా సూచిస్తోంది.
నగర జీవనశైలిలో యువతను నిరీ్వర్యం చేస్తున్న ‘మూడు ఎస్’లు.. స్క్రీన్, స్క్రోల్, సబ్‌స్టాన్స్. చదువు/కెరీర్ లక్ష్యాలకు ‘డీప్ వర్క్ విండోలు’, ఆఫ్‌లైన్ హాబీలు, క్రీడలు, కమ్యూనిటీ వాలంటీరింగ్ వంటి ‘డోపమైన్ ఆల్టర్నేటివ్‌లు’ అవసరం. లేదంటే రాత్రి స్క్రోలు ఉదయాన్ని అలసటగా మార్చడమే కాకుండా ‘డెడ్‌లైన్ డిజాస్టర్’గా తిరిగి వస్తూనే ఉంటుంది.
(చదవండి: బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!)