
మెహదీపట్నంలోని ఆలివ్ ఆసుపత్రిలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హెపటైటిస్ కన్సల్టేషన్ కోసం ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు తెలిపింది.
కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని, ఈ దిశగా తామీ ప్రయత్నం చేశామని ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పరాగ్ దశావతార్ (ఎండీ జనరల్ మెడిసిన్) తెలిపారు.
జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సుమారు 200 మంది కన్సల్టేషన్ సేవలు పొందారని ఆయన వివరించారు. ఆలివ్ హాస్పిటల్ సుమారు 210 పడకల అత్యాధునిక ఆసుపత్రి అని, తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)