
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్‌కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..
ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్‌కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు.
తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్.
ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్‌పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్‌తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్.
మంచిగానే పనిచేస్తుందా..?
రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్‌ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట.
వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్‌పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .
గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే)