breaking news
loneleness
-
ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్‌కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్‌కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు. తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్. ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్‌తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్. View this post on Instagram A post shared by Soul Safar with Bhaav (@soulsafarwithbhaav) మంచిగానే పనిచేస్తుందా..?రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్‌ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట. వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్‌పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
ఓ బిలియనీర్ ఒంటరితనం
లాస్ ఏంజెలిస్: అది నగరంలోని విలాసవంతమైన భవనాల్లో ఒకటి. 23 వేల చదరపు గజాల్లో దాన్ని అందంగా నిర్మించారు. అందులో ఎనిమిది ఖరీదైన బెడ్ రూమ్‌లు, 18 బాత్రూమ్లు, 16 కారు పార్కింగ్ గ్యారేజీలు, కొన్నింటిలో ప్రపంచంలోనే ఖరీదైనా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. డైనింగ్హాల్లో నగషీలు చెక్కిన 18 అడుగుల డైనింగ్ హాలు, భవనం వెలుపల విశాలమైన స్మిమ్మింగ్ పూల్, భవనమంతా అందమైన నగిషీలతో కూడిన ఆధునిక ఆర్కిటెక్చర్. ఏ గదిలో నుంచి చూసిన పసిఫిక్ సముద్రపు అందాలు కనువిందు చేస్తాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన స్వీట్ షాప్ కూడా ఉంది. భూలోక స్వర్గంగా కనిపించే ఆ భవనంలో అలా విహరిస్తుంటే....ఆహా ఏమి హాయిలే అలా.. అనిపిస్తుంది. ఇక ఆందులో నివసించే వాళ్ల జీవితమే...జీవితం అనుకుంటాం. కానీ 15వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తి కలిగిన ఆ ఇంటి యజమాని మాత్రం అలా అనుకోవడం లేదు. జీవితం బోర్, జీవితానకి లక్ష్యమంటూ లేకుండా పోయింది. మానవ సంబంధాలు మృగ్యమయ్యాయి. భయంకరమైన ఒంటరితనం. నా అన్నవారు లేకుండా పోయారనే బాధ. ఒంటరి తనం పోయేందుకు ఏర్పాటు చేసే విలాసవంతమైన పార్టీలకు కులాసా మనుషులు వస్తారు. కుషీగా గడిపి పోతారు. మళ్లీ ఒంటరితనం తరుముకొస్తుంది....ఇదీ 'మైన్‌క్రాఫ్ట్' అనే వీడియో గేమ్‌ను కనిపెట్టి రాత్రికి రాత్రి కుభేరుడైన మార్కస్ పర్సన్ ప్రస్తుత వ్యధ. ఒకరకమైన పశ్చాత్తాపం. ఆయన ఈ బాధను ట్విట్టర్లో ఫాలోవుతున్న రెండున్నర లక్షల మందితో పంచుకున్నారు. స్వీడన్‌కు చెందిన కంప్యూటర్ ప్రోగామర్‌గా పనిచేసిన మార్కస్‌ది కొంతకాలం క్రితం వరకు అందరిలాంటి సాధారణ జీవితమే. పైగా పేదిరికంతో కష్టాలు కూడా పడ్డారు. చిన్నప్పుడే కంప్యూటర్‌కు అతుక్కుపోయారు. అందుకని పెద్దగా ఎవరితో స్నేహం కూడా చేసేవాడుకాదు. ఆయన 12వ ఏట తాగుబోతైన తండ్రితో తల్లి విడిపోయింది. దొంగతనాలు చేసి తండ్రి జైలుపాలయ్యాడు. 2011, డిసెంబర్లో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరి అన్నా పడుచు ప్రాయంలోనే మత్తు పదార్థాలకు అలవాటై ఇంటి నుంచి గుర్తుతెలియని చోటుకు పారిపోయింది. మార్కస్ తన 18వ ఏట స్వీడన్లో కంప్యూటర్ ప్రోగామర్‌గా ఉద్యోగంలో చేరారు. అటూ ఉద్యోగం చేస్తూనే తీరిక వేళల్లో తనకిష్టమైన గేమ్ డిజైనింగ్‌కు ప్రయత్నించేవాడు. 2009లో ఆయన 'మైన్‌క్రాఫ్ట్' అనే వీడియో గేమ్‌ను కనిపెట్టడంతో ఆయన జీవితమే మారిపోయింది. ఆయన గేమ్‌ను దాదాపు పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. ఈలోగానే ఆయన అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌కు మారారు. తన గేమ్‌ను, గేమ్ డిజైనింగ్ కోసం ఏర్పాటు చేసిన తన కంపెనీని దాదాపు 15వేల కోట్ల రూపాయలకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి అమ్మేశాడు. నగరంలో విలాసవంతమైన భవనాన్ని నిర్ముంచుకున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఏడాదిలోగే ఆమె విడిపోయింది. అ తర్వాత సామాన్య కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆమె కూడా మార్కస్‌ను కాదని మరో సామాన్యుడితో వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కస్ ఒంటరి వారయ్యారు. దాన్ని నుంచి తప్పించుకునేందుకు కోట్లాది రూపాయలు పెట్టి పార్టీలు ఏర్పాటు చేసేవారు. దానికి సెలబ్రిటీలు వచ్చేవారు. అయినా ఆ పార్టీలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. కొన్నిసార్లు తన ఇంట్లో పనిచేసే వాళ్లను విమానాల్లో తీసుకొని పర్యాటక ప్రాంతాలు చుట్టి వచ్చేవారు. అయినా సంతృప్తిలేని జీవితంగానే భావించేవారు. 'ఏది కోరుకుంటే అది అందివస్తే. దానికి అర్థం లేదు. కావాల్సిన దాని కోసం కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. కల సాకారం అయినప్పుడు కలిగే అనుభూతి అనుభవించాలి. జీవితానికంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది లేనప్పుడు నాలా ఒంటరవుతారు' అంటూ ఆయన ట్విట్టర్లో తన బాధను షేర్ చేసుకున్నారు. ఆయన కనిపెట్టిన 'మైన్‌క్రాఫ్ట్' గేమ్ పిల్లల్లో ఎంత పాపులరైనా ఏ మాత్రం గొప్ప గేమ్ కాదు. క్రూడ్ బొమ్మలతో బిల్డింగ్ బ్లాక్‌లను నిర్మించే ఆట. ఆ గేమ్‌కు ఒక లక్ష్యమంటూ లేదు. అలాగే మన మార్కస్‌కు కూడా జీవితంలో ఓ లక్ష్యమంటూ లేకుండా పోయింది.