మూడు దశాబ్దాలకు పైగా వైద్యరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కామినేని ఆస్పత్రి.. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం నిరంతర ఆధునిక వైద్యం అందేలా రూపొందించిన ప్రపంచ స్థాయి సమగ్ర మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్, ఎం’బ్రేస్ ను శుక్రవారం ప్రారంభించింది. తల్లులు, పిల్లలు, మొత్తం కుటుంబాలకు సంపూర్ణమైన, నిరంతర వైద్యం అందించేందుకు ఈ అత్యాధునిక విభాగాన్ని ఆస్పత్రిలో రూపొందించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, వివిధ విభాగాల నిపుణుల అనుభవం, మానవీయ సంరక్షణను ఏకీకృతం చేస్తూ, మదర్ & చైల్డ్ ఆరోగ్య అవసరాలను తీర్చుతూ ఎం’బ్రేస్ పని చేస్తుంది.
మదర్ & చైల్డ్ కేర్ కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాదని అందరూ అవగాహన చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఎం’బ్రేస్ అందుబాటులో కి వచ్చింది. గర్భధారణ, ప్రసవానికి సంబంధించిన వైద్య సంరక్షణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, భావోద్వేగ, మానసిక, పోషక, అభివృద్ధి అవసరాలు తరుచుగా వేర్వేరుగా తీరుస్తున్నారు. ఈ లోటును పూరిస్తూ, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువు నుంచి పిల్లల అభివృద్ధి వరకు మదర్& చైల్డ్ కు కుటుంబాల సమక్షంలో సమగ్ర సంరక్షణను ఎం’బ్రేస్ అందిస్తుంది.
ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీఈవో డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ, “ఎం’బ్రేస్ ద్వారా మదర్ & చైల్డ్ ఆరోగ్య సంరక్షణను అత్యాధునిక వైద్య విధానంతో కొత్త దిశలో సేవలందిస్తున్నాం. కుటుంబాన్ని సంరక్షణ కేంద్రంగా ఉంచి, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, భావోద్వేగ, పోషక అవసరాలను కూడా సమగ్రంగా చూసుకోవడమే మా లక్ష్యం. ఆధునిక ఐసీయూలు, కార్డియాక్ సపోర్ట్ వ్యవస్థ, 24/7 బ్లడ్ బ్యాంక్ సేవలతో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాం ” అని తెలిపారు.
'హై రిస్క్ ప్రెగ్నెన్సీలను కాపాడే నమ్మకమైన కేంద్రంగా కామినేని ఆస్పత్రికి మంచి పేరు, అనుభవం ఉండడంతో అత్యాధునిక ఎం’బ్రేస్ విభాగాన్ని ప్రారంభించాం. ఆస్పత్రిలో మోడ్రన్ క్రిటికల్ కేర్, ఆధునిక కార్డియాక్ సిస్టమ్స్, రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలు, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల పర్యవేక్షణలో మదర్ & చైల్డ్ ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడం, తల్లులకు నమ్మకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించడం, అలాగే కుటుంబాలను మదర్& చైల్డ్ సంరక్షణలో క్రియాశీల భాగస్వాములుగా మార్చడంలో ఎం’బ్రేస్ యూనిట్ పని చేస్తోంది.' అని సీఈఓ డాక్టర్ గాయత్రి కామినేని వివరించారు.
అనంతరం ఎం'బ్రేస్ గురించి కార్యక్రమ ముఖ్యఅతిథి, ప్రముఖ నటి భూమిక చావ్లా మాట్లాడుతూ.. “ ప్రెగ్నెన్సీ అనేది సంరక్షణ, అవగాహన, కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు అవసరమైన ప్రక్రియ. వైద్య చికిత్సతో పాటు తల్లుల భావోద్వేగ, మానసిక శ్రేయస్సును గుర్తించే ఎం’బ్రేస్ ఒక చక్కని అధునాతన ఆలోచనాత్మక ప్రయత్నం. ఇది కామినేని ఆసుపత్రిలో అనేక కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
ఇప్పటికే ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా రూపొందిన ఎం’బ్రేస్, ఇంటికి దగ్గరలోనే నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది. సంతానోత్పత్తి చికిత్స, గర్భధారణకు ముందు, తర్వాత సంరక్షణ, నవజాత శిశువులు, పిల్లలకు ప్రత్యేక సంరక్షణ (ఎన్ఐసీటీయూ సపోర్ట్ సహా).
తల్లులు కుటుంబాల భావోద్వేగ, మానసిక ఆరోగ్యానికి కౌన్సెలింగ్. తల్లులు, పిల్లలకు వ్యక్తిగత డైట్ సలహాలు. పాలిచ్చే విధానంలో సహాయం గైడెన్స్ అందించడం ద్వారా కుటుంబాలు అనేక ఆస్పత్రుల మధ్య తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
ఎం' బ్రేస్ యూనిట్ టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆబ్స్టెట్రిషియన్స్ & గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, నియోనాటాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, లాక్టేషన్ కన్సల్టెంట్స్, శిక్షణ పొందిన నర్సులు, మిడ్వైవ్స్, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్టులతో కూడిన బలమైన బృందం ఉంటుంది.
ఈ సమన్వయ విధానం ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన నిరంతర సంరక్షణతో పాటు అవసరమైనప్పుడు అత్యవసర, కార్డియాక్, రక్త మార్పిడి సేవలను వెంటనే అందిస్తోంది.
(చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)


