
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది?
అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం.
ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు.
ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్‌లో..)