
వంటవాళ్ల జీతం మహా అయితే ఎంతో ఉంటుంది అనుకుంటాం. పైగా అది చాలా శారీరక శ్రమ ఓర్చి చేయాల్సిన పని కూడా. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వంటవాడి జీతం గురించి తెలిస్తే..ఇంకెప్పుడూ అంత తక్కువ అంచనా వేయరు. చిన్న చితకా పనులు చేసేవాళ్లు కూడా తెలివిగా స్మార్ట్‌గా చేయగలరు అనే ప్రూవ్ చేస్తున్నారు. ఒకరకంగా వారి పనే బెటర్‌గా ఉంది అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి వ్యక్తి ఈ ముంబై వంటవాడు. కేవలం అరగంట పనికి నెలకు రూ. 18 వేలు వరకు ఛార్జ్ చేస్తాడట. అంతలా.. ఎవరూ ఇస్తారు అనుకోకండి.
ఎందుకంటే ముంబైకి చెందిన న్యాయవాది ఆయుషి దోషి నెట్టింట ఈ విషయాన్ని షేర్ చేయడంతో పెనుదూమారం రేపి చర్చలకు దారితీసింది. తన వంట వాడిని మహారాజ్‌గా సంభోదిస్తూ అతడి పనితీరు సంపాదన తీరుగురించి పోస్ట్‌లో వెల్లడించారు. దాంతో నెటిజన్లంతా అదంతా అబద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వంటవాడు కార్పొరేట్ ఉద్యోగిలా సంపాదిస్తాడని. జస్ట్ అరగంట పనికి నెలకు రూ. 18 వేలు జీతం తీసుకుంటాడని, అలా రోజుకు పది నుంచి 12 ఇళ్లల్లో పనిచేస్తాడని చెప్పుకొచ్చారు.
దాంతో నెటిజన్లు ఆమె చెప్పినదాంట్లో పూర్తి నిజం లేదని మండిపడడారు. నిజంగా అతడు అరగంటలో వంట చేసేయగలడా..? ఏమైనా ఏఐ ఉపయోగిస్తున్నాడా ఏంటీ.. అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఆ కామెంట్లకు బదులిస్తూ న్యాయవాది ఈ విధంగా పోస్ట్‌లో పేర్కొన్నారు. ముంబై ప్రజలరా నేను చెప్పింది వాస్తవమే. ఖరీదైన మెట్రో నగరాల్లో మహమహారాజులు వసూలు చేసేది ఈ రేంజ్‌లోనే ఉంటుంది.
"అదే వంటవాడు 12 మంది ఉన్న కుటుంబానికి రూ. 2.5 వేలు దాకా వసూలు చేస్తాడు. అయితే మీప్రాంతాల్లో ఇంకా అంత తక్కువ జీతానికే వంటవాళ్లు పనిచేసినంతా మాత్రాన అన్నిచోట్ల అలానే ఉంటుందని అనుకోవద్దు. ఖరీదైన నగరాలో జీవితానుభవం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా జీవన వ్యయాల్లో వ్యత్యాసాలు ఉంటాయనే విషయం మరిచపోవద్దు అనినొక్కి మరి పోస్ట్‌లో వెల్లడించింది". న్యాయవాది ఆయుషి
My Maharaj (Cook)
•Charges ₹18k per house
•Max 30 mins per house
•10–12 houses daily
•Free food & free chai everywhere
•Gets paid on time or leaves without a goodbye 😭
Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.🙂— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025
(చదవండి: లైట్‌హౌసింగ్ పేరెంటింగ్ అంటే..? పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దగలదా..?)