
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది మన సామెత. ‘నోరు ఆరోగ్యంగా ఉంటేనే నా కెరీర్ బాగుంటుంది. భవిష్యత్ బాగుంటుంది’ అనేది బ్రిటిష్ నటి, గాయని సింథియా ఎరివో మాట. ‘నవ్వే నా ఆస్తి.. నా గొంతే నా ఐశ్వర్యం’ అంటున్న సింథియా సుమారు 16.5 కోట్లకు తన గొంతును బీమా చేయించింది. మౌత్‌వాష్ బ్రాండ్ ‘లిస్టెరిన్’ ‘వాష్ యువర్ మౌత్’ క్యాంపెయిన్‌కు ఆమె ప్రచారకర్తగా ఉంది.
‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా అందమైన నవ్వు, శక్తిమంతమైన స్వరం నా గుర్తింపు’ అని చెప్పే సింథియా దంత శుభ్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వేదిక ఎక్కినప్పుడల్లా బ్రష్ చేసుకుంటుంది. నోటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతుంది.
శరీర భాగాలకు బీమా చేయించడం కొత్తేమీ, వింతేమీ కాదు. కాళ్లు, వీపు, స్వరపేటిక, నాలుక...ఇలా రకరకాల శరీర భాగాలకు బీమా చేసుకున్నవారు హాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అక్కడ ఇదొక ట్రెండ్‌గా కొనసాగుతోంది.
(చదవండి: నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ)