విడుదలకు ముందే జాన్వీ కపూర్‌ మూవీ ఘనత.. ఏకంగా ఆస్కార్‌ అవార్డుకు ఎంట్రీ | Janhvi Kapoor Latest Movie Home Bound India official entry for 2026 | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: రిలీజ్‌కు ముందే అరుదైన ఘనత.. ఆస్కార్‌ అవార్డుకు ఎంట్రీ

Sep 19 2025 7:09 PM | Updated on Sep 19 2025 8:03 PM

Janhvi Kapoor Latest Movie Home Bound India official entry for 2026

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం హోమ్‌ బౌండ్‌ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్-2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన  ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: జాన్వీ కపూర్‌ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది)

తాజాగా ఈ చిత్రం 2026 ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఇండియా నుంచి అఫీషియల్‌గా ఎంట్రీ సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్‌ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హౌమ్ బౌండ్‌ పోటీపడనుంది. ఈ సినిమాను కరణ్‌ జోహార్, అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రనిర్మాత మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement