
ఎన్నో ప్రేమకథలు గురించి విని ఉండి ఉంటారు. ఇలాంటి వెరైటీ లవ్‌స్టోరీ మాత్రం విని ఉండరు. ఎవ్వరైన నచ్చిన అమ్మాయి/అబ్బాయికి ఓకే చెప్పేందుకు ట్రై చేయడం, నిరీక్షించడం కామన్. కానీ మరి ఇన్నిసార్లు మాత్రం ప్రపోజ్ చెయ్యరు. ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే.. గుండెపగిలిపోయినంతగా బాధపడతారు ప్రేమికులు. ఆ తర్వాత రాను.. రాను.. లైట్ అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ఇలాంటి ప్రేమికుడు కాదు. తన ప్రియురాలు చేత ఓకే చెప్పించేంత వరకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేశాడో వింటే నోరెళ్లబెడతారు. ఇంతలానా బాస్ అంటారు.
ఏడేళ్ల ప్రణయ ప్రేమకథ ఇది. ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫెయిలైతే ట్రై చేసినట్లుగా లవ్ ఎగ్జామ్ రాశాడు మనోడు. యూఎస్‌కు చెందిన 36 ఏళ్ల ల్యూక్ వింట్రిప్ తన స్నేహితురాలు సారాను 2018లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమె అస్సలు అతడి లవ్‌ని అంగీకరించలేదట. అలా అని అక్కడితో వదిలేయలేదు ల్యూక్. ఆమె ఓకే అనేంత వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఏదో రెండు, మూడు, ఐదు సార్లు కాదు ఏకంగా 42 సార్లు ల్యూక్ ప్రపోజల్‌ని స్నేహితురాలు రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలో ఈసారి కాకపోయినా..మరోసారి అయినా తన దేవత అంగీకరించపోతుందా అని ఆశగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ల్యూక్. ఏమైతేనేం..43సారి తన స్నేహితురాలు సారా చేత 'యస్' అనిపించుకున్నాడు. ఈ ఏడాది(2025)కి తన అమర ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకొచ్చాడు.
చెప్పాలంటే అతడిలా ఏ లవర్ అన్నిసార్లు ప్రపోజ్ చేసి ఉండడు. నిజంగా అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డులకి ఎక్కాల్సిందే ఈ విషయంలో. అతడి భాగస్వామి సారా కూడా అలానే అంటూ అతడిని ఆటపట్టిస్తోందామె. అయితే సారా కూడా ల్యూక్‌ని తొలిచూపులోనే ప్రేమించింది కానీ ఆమెకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో వెంటనే అంగీకరించలేకపోయింది. అదీగాక విడాకులు తీసుకుని ఉండటంతో మరొసారి వైవాహిక బంధం అనగానే ఆమెకు ఒక విధమైన భయం, ఆందోళన వెంటాడంతో ల్యూక్ ప్రేమను అంగీకరించలేకపోయిందట.
ఏదిఏమైతేనేం తన ప్రియురాలి మనసు కరిగేలా చేసి తన ప్రేమను గెలుపించుకున్నాడు ల్యూక్. ఇక్కడ సారా తన పిల్లలు, బంధువులు అంగీకరించాక..ఎలాంటి సమస్యలు ఉండవని నిర్థారించుకున్నాక..అతడికి ఓకే చెప్పిందట. అంతేకాదండోయ్ ల్యూక్ తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేసేవాడట. దాని కోసం అతడు పడిన పాట్లు అన్ని ఇన్నీ కావట కూడా. ఇక 43వ సారి టైం కీపింగ్ నావిగేషన్ గ్రీన్విచ్‌కు తీసుకెళ్లి మరీ ప్రపోజ్ చేశాడట ప్రియురాలు సారాకు.
"ఈ ప్రదేశం టైంకి సంబంధించిన ప్రపంచ కేంద్రం అయితే ..నువ్వు నా ప్రపంచానికి కేంద్రానివి, అందుకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా" అంటూ భావోద్వేగంగా ప్రియురాలికి ప్రపోజ్ చేశాడట. అతడి మాటలకు ఉప్పొంగిన కన్నీళ్లతో అంగీకరించా అంటూ తన ప్రేమకథను గుర్తుచేసుకుంది సారా. అతడి ఓపికకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే, నిజంగా అతడు గొప్ప ప్రేమికుడు అంటూ ప్రియుడు ల్యూక్‌పై ప్రశంసల వర్షం కురిపించేసింది సారా.
(చదవండి: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..)