బుడ్డోడి డేరింగ్‌ ఫైర్‌ స్టంట్‌కి షాకవ్వాల్సిందే..! | 8 Year Old Aarav Who Plays With Fire Goes Viral | Sakshi
Sakshi News home page

బుడ్డోడి డేరింగ్‌ ఫైర్‌ స్టంట్‌కి షాకవ్వాల్సిందే..! వీడియో వైరల్‌

Aug 1 2025 1:58 PM | Updated on Aug 1 2025 2:48 PM

8 Year Old Aarav Who Plays With Fire Goes Viral

చిన్నారులు కూడా చిరుప్రాయంలోనే చిచ్చిర పిడుగుల్లా తమ ప్రతిభను చాటుకుని శెభాష్‌ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. కానీ ఇలా అగ్గితో అవలీలగా ఆడుకునే చిన్నారిని చూసుండరు. ఏ మాత్రం బెరుకులేకుండా చేస్తున్న ఆ ఫైర్‌ విన్యాసం కళ్లు ఆర్పడమే మర్చిపోయేంతలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ డేరింగ్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

తమిళనాడుకు చెందిన ఆరవ్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడు.. నిప్పుతో ఆడే ఒక రకమైన యుద్ధకళతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆరవ్‌ రాష్ట్రస్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌ కూడా. ఆ బాలుడు తమిళనాడుకి చెందిన పురాతన ఆయుధ ఆధారిత యుద్ధ కళ అయిన 'సిలంబం'ని అలవోకగా చేసి అలరించాడు. 

ఇది ఇరువైపులో అగ్నితో జ్వలిస్తున్న కర్రతో ఒక విధమైన విన్యాసంలా ప్రదర్శిస్తారు. ఎంతో శిక్షణ ఉంటేనే గానీ ఇంతలా డేర్‌గా చేయడం కష్టం. చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సిన ప్రాచీన యుద్ధ కళ ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. కానీ ఈ బుడతడు ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఆ కళకే వన్నెతెచ్చేలా అత్యంత అద్భుతంగా ప్రదర్శించాడు. 

దీన్నిచూసిన నెటిజన్లు సిలంబం కళకే గర్వ కారణం అంటూ ప్రశంసించారు. ఆ వీడియోలో ఆరవ్‌ ప్రదర్శన సమయంలో కాలిపోతున్నట్లుగా కనిపించినా.. ఎక్కడ ఆగకుండా చేస్తున్న తీరు చూపరులను కట్టిపడేస్తుంది. చిన్న వయసులోనే ఇంత డేరింగా అని ఆశ్చర్యంకలుతుంది. 

ఇక ఆ వీడియోలో కూడా ఎవరూ దీన్ని ట్రై చేయొద్దు. తాము నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఇచ్చాం అంటూ ఒక హచ్చరిక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. కనుమరుగవుతున్న మన ప్రాచీన కళలు ఈ విధంగానైనా ప్రస్తుత జనరేషన్‌ తెలుకునే అవకావశం దొరికింది అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

 

(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్‌ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement