
మన భారతీయ వంటకాలు ఎంతటి మహామహులనైన ఫిదా చేస్తాయి. వండే విధానం, వాటి రుచికి దాసోహం అని అనను వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా మైమరిపించే మన వంటకాల రుచికి ఓ ప్రముఖ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ సీఈవోనే ఇంప్రెస్ అయ్యి..ఆరోగ్యకరమైన రెసిపీలంటూ ప్రశంసించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ కాలిఫోర్నియా బురిటో వ్యవస్థాపకుడు అమెరికన్ బ్రెట్ ముల్లర్..మన బెంగళూరు వంటకాల రుచికి ఫిదా అయ్యాడు. ఆయన బసవగుడిలో కామత్ శాకాహార రెస్టారెంట్‌లో జోలాడ రోటీ భోజనాన్ని ఆస్వాదస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ శాకాహార రెస్టారెంట్‌లో ఉత్తర కర్ణాటక శైలి థాలిని ఆయన ఆనందంగా ఆస్వాదించారు.
తాను ఈ రెస్టారెంట్‌కి తన చార్టర్ అకౌంటెంట్ సిఫార్సుపై 2014లో ఇక్కడి వచ్చానని ఆ వీడియోలో తెలిపారు. అప్పట్లో ఈ నగరానికి కొత్త..అంటూ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రెస్టారెంట్లో భోజనం గురించి వివరిస్తూ..ప్లేట్‌లోని తాజా కూరగాయల వంటకాలు, క్రిస్పీ సలాడ్లు, ఉత్సాహభరితమైన రుచులతో ఇంప్రెస్ చేస్తుంది. జొన్న రొట్టె మీద వెన్న కరుగుతూ ఉండగా వేడివేడిగా ఉన్న గుత్తు వంకాయ కూరలో నొంచుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగా ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంటుంది అని చెబుతున్నాడు ముల్లర్.
తాను ఈ జోలాడ రొట్టెని ఆస్వాదించాలని మూడు సార్లు ఈ బసవనగుడికి వచ్చానని అన్నారు సీఈవో. బెంగళూరు అంతటా ఇలాంటి ఆహారాలు ఉన్నా..ఇక్కడి జోలాడ రొట్టె మాత్రం అత్యంత విభిన్నంగా ఉంటుందని అన్నారు. అక్కడెక్కడ ఇలాంటి రుచి లభించదని అన్నారు. ఇది రుచికి రుచి, ఆరోగ్యం కూడా అని ప్రశంసించారు. అయితే ఇలాంటి భోజనం తిన్నాక తప్పకుండా జిమ్‌కి వెళ్లక తప్పదు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఆయన ఇక్కడ బెంగళూరు వంటకాలను మెచ్చుకున్నప్పటికీ..ఇక్కడి ట్రాఫిక్ పట్ల అత్యంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్వరత్వరగా వెళ్లేందుకు ఆటోలకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ముల్లెర్ 2012లో 22 ఏళ్ల వయసులో బెంగళూరు నగరం వచ్చి తన తొలి కాలిఫోర్నియా బురిటో అవుట్‌లెట్‌ను ప్రారంభించాడు. ఈ మెక్సికన్ ఫాస్ట్-క్యాజువల్ బ్రాండ్ క్రమంగా అభివృద్ధి చెంది.. భారతదేశం అంతటా సుమారు 100కు పైగా అవుట్‌లెట్‌లతో విస్తరించింది.
ఇది సుమారు 20 కోట్లపైనే లాభాలను ఆర్జిస్తోంది. ఇక ఈ వ్యాపారం కూడా ఇతర బిజినెస్‌ల మాదిరిగానే మహమ్మారి సమయంలో ఆటుపోట్లకు గురైంది. దాని 37 దుకాణాల్లో సుమారు 19 దుకాలు మూతపడ్డాయి కూడా. కానీ ఈ బ్రాండ్‌కి ఉన్న ఆదరణతో మళ్లీ శక్తిమంతంగా పునరాగమనం చేసి..అచ్చం అదే తరహాలో లాభాలబాట పట్టింది. పైగా అశేష జనాదరణ పొందేలా ఇటీవలే తన వందవ స్టోర్ ప్రారంభోత్సవాన్ని కూడా జరుపుకోవడం విశేషం.
California Burrito CEO x Jolad Rotti Meals pic.twitter.com/eFlhLCsjqX
— Season Flake 🏗️ (@seasonflaketopg) July 29, 2025
(చదవండి: టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే! ఇలా తాగితే..)