
హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం.
మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్‌యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు.
మందులు పనిచేయకపోవడానికి రీజన్..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.
సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..
కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.
రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ కావొచ్చు..
మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.
తక్షణమే అవగాహన అవసరం..
"రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్‌డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్
డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!)