
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు. ప్రతి సినిమా కోసం తన ఆకృతిని చాల సునాయాసంగా మార్చుకుంటాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా నిబద్ధతను చూపిస్తారు. అయితే ప్రబాస్ ఇలా సినిమా కోసం ఇంతలా తన బాడీలో వేరియేషన్ చూపించాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా బాహుబలిలో రాజులా ఆ పాత్రలో లీనమైపోయేలా కనిపించిన అతడి ఆహార్యం.. ఆ తర్వాత సాహో సినిమాకు చాలా స్లిమ్‌గా మారిపోయింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలా డైట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ రూపురేఖల్ని మార్చుకుంటుంటారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.
బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపించాలి కాబట్టి ప్రతి ఉదయం చాలా గుడ్లు తినేవారట. ఆ విషయమై ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ని అడగగా..ఆయన అవునని చెప్పారు. ఎందుకంటే కండలు తిరిగిన దేహంతో రాజసం ఉట్టిపడేలా కనిపించాలి కాబట్టి తప్పలేదన్నారు. అయితే అన్ని గుడ్లు తినడం చాల కష్టమని అన్నారు.
చెప్పాలంటే ఒక రోజులో 20 నుంచి 30 గుడ్లు దాక తిని ఉంటానని అన్నారు. అయితే ఉడకబెట్టినవి తినడం కష్టమని అందుకని వాటిని ప్రోటీన్‌తో మిక్స్ చేసి ఒక జ్యూస్ మాదిరిగా తాగాల్సి ఉంటుందట. అలా అయితేనే.. గుడ్డు పచ్చి వాసన అంతగా ఉండదు కాబట్టి, అన్ని తినగలమని చెప్పారు. ఆ తర్వాత 2019లో సాహో మూవీని ప్రమోట్ చేశారు. అప్పుడాయన ఇదివరకటి ప్రభాస్‌లా చాలా స్లిమ్‌గా కనిపించారు.
అప్పడు కూడా ప్రభాస్ బాహుబలి మాదిరిగానే అలాంటి ట్రిక్ ఏదైనా ఫాలో అయ్యారా అని మీడియా అడగగా..అదేం లేదన్నారు. అయినా బహుబలి పూర్తి అయ్యిన వెంటనే సన్నబడాలని అనుకున్నానని, అందుకోసం స్ట్రిక్ట్‌గా శాకాహారం తీసుకున్నట్లు వివరించారు. శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది బరువు తగ్గడానికి సహయపడుతుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్.
బాహుబలి మూవీ టైంలో నెలల తరబడి కండరాలు పెంచేందుకు చాలా ఎక్కువగా తినాల్సి వచ్చింది, కాబట్టి దాన్ని తగ్గించాలంటే ప్యూర్ వెజిటేరియన్‌గా మారక తప్పదని అన్నారు ప్రభాస్. ఏ డైట్‌ని అనుసరించినా.. నిపుణులు పర్యవేక్షణలో ఆరోగ్యంగానే అమలు చేస్తానని అన్నారు. చివరగా ఏ డైట్ అయినా హెల్దీగా సరైన పద్ధతిలో అనుసరిస్తే మంచిగా బరువు తగ్గుతారని, అదేమంతా కష్టం కాదని అన్నారు ప్రభాస్.
అంతలా గుడ్లు తీసుకోవచ్చా అంటే..
గుడ్లు ఎప్పడు అద్భుతమైన ప్రోటీన మూలం. అని దాన్ని పలు రూపాల్లో తీసుకోవడం మంచిదేనని అన్నారు. అలాగే మరి అంతలా అంటే.. జీర్ణక్రియపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అచ్చం గుడ్డులో లభించే ప్రోటీన్ మన శాకాహారంలో 20 రకాల ఆహారాల్లో కనిపిస్తుందని చెప్పారు. వాటిని తీసుకున్నా.. సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుందిన చెప్పారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్‌ఫిల్..!)