
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు తన డైట్ గురించి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా వందగ్రాముల ప్రోటీన్‌ని వినియోగిస్తానని చెప్పారామె. దాదాపు 50 కిలోలు ఉండే ఆమె ఈ రేంజ్‌లో ప్రోటీన్ తీసుకోవడం సరైనదేనా అంటే..
భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకుమించి తీసుకోవడం అంటే..బహుశా కార్బోహైడ్రేట్‌కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరం అయ్యి ఉండొచ్చని అన్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్ ఎలా అని సందేహ పడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు.
అందుకోసం కేవలం ఈ మూడింటితో భర్తి చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్, పప్పు తీసుకుంటే చాలని చెబుతున్నారు. దీంతోపాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ప్రదానంగా గుర్తించుకోవాల్సినవి..
వెజ్ ప్రోటీన్ ఒక్కోసారి కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్‌డైట్ సరిపడకపోవచ్చు. గట్ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
అదీగాక అధిక ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం మలబద్దకం, జీర్ణశయాంంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు.
ఇక్కడ గట్‌ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ..క్రమంగా ప్రోటీన్ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు.
అదే సమయంలో ఇక్కడ సమంతా అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే సగటు వ్యక్తికి "సెలబ్రిటీ నియమావళి" వర్తించిందని, అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బదులుగా స్మార్ట్‌గా ఎంపిక చేసుకుని తినడం మంచిదని సూచించారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్‌ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!)