
మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు, రక్తప్రసరణల అడ్డంకులు రకరకాల సమస్యలకు కారణం అవుతుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ సమస్యను యోగాసనాల ద్వారా బ్యాలెన్స్ చేసుకునే ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ప్రసరిత హస్త ఉత్థానాసన ఒకటి. దీన్నే వైడ్ స్టాన్స్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు.
ప్రసరిత హస్త ఉత్థానాసన...
సంస్కృతంలో ‘హస్త’ అంటే చేతులు, ‘ఉత్’ అంటే తీవ్రమైన, ‘తాన్’ అంటే సాగదీయడం, ‘ప్రసరిత’ అంటే విస్తరించడం. చేతులు, పాదాలను స్ట్రెచ్ చేయడం ఈ ఆసనంలో చూస్తాం. ఈ ఆసనం ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేసింది. మీరు దీన్ని ఎలా చేయవచ్చో ఇక్కడ ఉంది.
ఇలా చేయాలి...
సమస్థితిలో నిలబడి, దీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి
చేతులను తలపైకి లేపి, వెన్నును ముందుకు తలను వెనక్కి వంచాలి. ఈ సమయంలో చేతులు కూడా వెనక్కి వంచాలి
అదే భంగిమ నుంచి మెల్లగా తల భూమికి ఆనేలా ముందుకు వంగాలి. చేతులను నేలకు ఆనించడం, వీలైతే దాలను పట్టుకోవడం.. చేయవచ్చు
ఈ భంగిమలు ఐదు దీర్ఘ శ్వాసలు తీసుకొని, వదలాలి. తిరిగి యధా స్థితికి చేరుకోవాలి
దీంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మెరుగు అవుతాయి. సూర్య నమస్కారాల్లో రెండవ భంగిమతో మొదలుపెట్టే ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవల్స్, రక్త ప్రసరణలో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.