
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్‌లు, వర్కౌట్లు చేస్తుంటారు. వాటి తోపాటు బాడీలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ఈ పానీయాలను కూడా జోడించినట్లయితే బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. అందుకోసం అల్లాన్ని తప్పనిసరిగా మన రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. మరి అదెలాగో తెలుసుకుందామా..!.
అధిక బరువుకి చెక్ చెప్పే అద్భుత పానీయాలివే..
గోరు వెచ్చిని అల్లం లెమెన్ వాటర్..
గోరువెచ్చని అల్లం నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి పరగడుపునే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే బాడీలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి త్వరితగతిన బరువు తగ్గేలా చేస్తుంది.
తయారీ విధానం: గోరువెచ్చని నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత నిమ్మకాయను జోడించి తీసుకుంటే చాలు. కావాలనుకుంటే దాల్చిన చెక్క లేదా నల్లమిరియాలు కూడా జోడించొచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా అల్లం షాట్: ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఎలా తయారు చేయాలంటే: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌కు అరటీస్పూన్ అల్లం రసం జోడించాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు జోడించాలి. రోజుకు ఒకసారి భోజనానికి ముందు తాగాలి. ఇది దంతాల సంరక్షణకు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
దోసకాయ అల్లం డీటాక్స్: దీన్ని రిఫ్రెషింగ్ డ్రింగ్‌గా పిలుస్తారు. రోజంతా ఈ నీటిని సిప్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అనవసరమైన చిరుతిండిని అరికట్టడంలో సహాయపడుతుంది.
తయారీ విధానం: దోసకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు వేసి కొన్ని గంటలు లేదా రాత్రంత నానబెట్టాలి. ఈ వాటర్‌ని ఒక బాటిల్‌లో పోసుకుని కూడా హాయిగా తీసుకువెళ్లొచ్చు.
అల్లం గ్రీన్ టీ: ఇది శరీరంలో కొవ్వుని సులభంగా కరిగిస్తుంది. భారీ భోజనాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
తయారీ విధానం: వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్‌ని ఉంచి, అల్లం జోడించాలి. తాగాడానికి కొన్ని నిమిషాలు ముందు చేసుకుంటే చాలు. వ్యాయమానికి ముందు ఆస్వాదిస్తే..సులభంగా బరువు తగ్గుతారు.
పసుపు అల్లం లాట్టే (గోల్డెన్ మిల్క్)
మంచి నిద్రకు సరైనది ఇది. చలికాలంలో మంచి వెచ్చదనాన్ని అందించి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం, పసుపు మిశ్రం శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట జీర్ణక్రియకు మద్దతిస్తుంది.
తయారీ విధానం: గోరువెచ్చని ఒక కప్పు బాదం లేదా ఓట్‌మిల్క్‌లో తాజా అల్లం లేదా అలం పొడిని కలపాలి. చిటికెడు నల్లమిరాయాలు, దాల్చిన చెక్క కలపి మరిగించండి. అవసరమైతే తేనెతో తాగండి.
ఈ పానీయాలు డైట్‌లో చేర్చుకుంటే ఆకస్మికంగా అద్భుతమైన మార్పులు రాకపోయినప్పటికీ, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే సమతుల్యం ఆహారాన్ని మెయింటైన్ చేయడంలో ఉపకరించడమే గాక సులభంగా బరువు తగ్గేందుకు దారితీస్తుంది.
(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!)