
చాలా రకాల డైట్‌లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..
'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు.
వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్‌లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్‌లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.
'వైకింగ్స్ డైట్' అంటే?
దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది.
తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు.
అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్‌లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు.
పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు.
మంచిదేనా..?
ఈ డైట్‌లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు.
ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్‌లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
దుష్ప్రభావాలు..
అయితే ఈ డైట్‌లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్‌తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఈ డైట్‌ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.
(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?)