Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా? | Shreyas Iyer Hospitalised in Australia: What Is a Rib Cage Injury | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?

Oct 27 2025 5:45 PM | Updated on Oct 27 2025 6:37 PM

Shreyas Iyer Hospitalised in Australia: What Is a Rib Cage Injury

టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా  అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్‌ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. 

సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్‌ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

పక్కటెముక గాయం అంటే..
ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్‌ అవ్వదని చెబుతున్నారు. 

దీనికి ఆపరేషన్‌ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. 

పక్కటెముక విరిగితే..
పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు.  

అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్‌లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. 

లక్షణాలు..

శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పి

ముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపు

గాయం లేదా రంగు మారడం

వామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..
పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.

ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్‌ టెక్నిక్స్‌ ఫాలో అవ్వాల్సిందే!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement