ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..
నెఫ్రాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్‌గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..
మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తి
ట్రాన్స్‌ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.
డయాలసిస్‌తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయి
మునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారట
నష్టాలు..
అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట.
అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.
కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట.
రెండిటిలో ఏది మంచిదంటే..
డయాలసిస్‌లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్‌ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు.
దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్)


