
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు.
కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్‌గా పరిగణించాలి.
నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...?
నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్‌సైకిల్స్ కొనసాగుతుంటాయి.
వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్‌ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.
ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు...
ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్‌మెంట్ ఎలాగో సూచిస్తారు.
డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్
(చదవండి: