మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే! | How do I win my husband back with a love spell | Sakshi
Sakshi News home page

మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!

Nov 6 2025 10:12 AM | Updated on Nov 6 2025 10:34 AM

How do I win my husband back with a love spell

మా పెళ్లయి ఆరు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మాది అన్యోన్య దాంపత్యమే. అయితే. ఇటీవలే ఆయనకు ఒకావిడతో పరిచయం అయింది. అప్పటినుంచి నన్నూ, పిల్లలనీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, వెళ్లడం.... అదేమని అడిగితే, నా ఇష్టం అని సమాధానం చెబుతారు. నామీద ఎంతో ఇష్టంతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నాతో ఉన్నాయన ఈ మధ్య నాకు క్రమేపీ దూరమై మరో మహిళకు దగ్గరవుతున్నారు. 

మా బంధువులు ఇది తెలుసుకుని ఆయనకు ఆమె మందుపెట్టి తనవైపు తిప్పుకున్నదని, అందుకే ఆమె వ్యామోహంలో పడిపోయి ఉంటాడని చెబితే రెండుసార్లు మందు కూడా కక్కించాం. అయినా ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ ఇంకోసారి మందు కక్కించమంటున్నారు. అసలు నిజంగా ఒక వ్యక్తిని మందుపెట్టి ఇలా లోబరచుకోవడం జరుగుతుందా? మేము ఎన్నిసార్లు కక్కించాలి?
– స్వరాజ్యలక్ష్మి, తణుకు

మందుపెట్టడం, మందు కక్కించడం రెండూ ఫార్సే! అనాదిగా మనలో నాటుకు΄ోయిన మూఢనమ్మకాలకు ఇది నిదర్శనం తప్ప వీటిలో ఏమాత్రం నిజం లేదు. విషప్రయోగం చే సి, ఒక వ్యక్తిని హత్య చేయవచ్చేమోగాని, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడానికి మనసు మార్చి మరొకరివైపు మళ్లించడానికి మందులంటూ ఏమీ లేవు. ఉండవు. మనకున్న కొన్ని నమ్మకాల వల్ల మందు పెట్టడం, మంత్రం వేయడం, చేతబడి చేయించడం లాంటివి ఉన్నాయని మన పూర్వీకులు మనకు నూరి΄ోశారు. 

ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని మందు పెట్టే వారు కొందరు, ఆ పెట్టిన మందును కక్కించే స్పెషలిస్టులు కొందరూ తయారయ్యారు. ఎప్పుడో కొన్ని రోజుల కిందట పెట్టిన మందులు మాకులూ ఇన్నాళ్లు కడుపులో ఉందే అవకాశమే లేదు. అది జీర్ణమైనా అవాలి లేదా విరేచనం ద్వారా రెండు రోజుల్లో బయటపడాలే తప్ప అన్నేసి రోజులు అలాగే లోపల అంటిపెట్టుకుని΄ోయే అవకాశమే లేదు. శాస్త్రీయమైన ఇలాంటి నిజాలు తెలియక చాలామంది అవన్నీ నిజమని మీలాగా అ΄ోహపడుతుంటారు. 

ఇప్పటికయినా మీరు ఆ పెట్టని మందును కక్కించే ప్రయత్నాలు విరమించి, మీ ఆయన ఎందుకలా మూడోవ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో ఆలోచించండి. మీలో నచ్చనిది, ఆవిడలో నచ్చినది ఏదైనా ఉందేమో మీకు మీరుగా ఆలోచించండి లేదా ఓర్పుగా నేర్పుగా ఆయన నుంచి తెలుసుకుని నిదానంగా ఆయనను మళ్లీ మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. 

కొన్నిసార్లు మీలో ఎలాంటి నెగటివ్స్‌ లేకపోయినా, కొందరు మగవారు మనస్తత్వరీత్యా ఇలా ఇతరులవైపు ఆకర్షితులవుతారు. అదే నిజమైతే, మీరు ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదిస్తే, వారు మరింత లోతుగా పరిశీలించి ఇరువురికీ కౌన్సెలింగ్‌ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి,సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.
( మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

(చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement