ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
పోలీసుల విచారణతో అసలు విషయం వెలుగులోకి..
పాల్వంచ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించింది. పోలీసులకు అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సతీష్ శుక్రవారం ఆ వివరా లు వెల్లడించారు.
పాల్వంచ వెంగళరావుకాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39) ఈనెల 15న తెల్లవా రుజామున ఇంటి వెనుకభాగంలో స్లాబ్ హుక్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయ న భార్య శ్రుతిలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
అయితే శ్రుతిలయకు మరో వ్యక్తితో వివాహే తర సంబంధం ఉందని, గతంలో పంచాయితీ చేసినా మార్పు రాలేదని హరినాథ్ తల్లి మంగమ్మ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శ్రుతిలయను విచారించగా అసలు విషయం బయటపడింది.
అడ్డుగా ఉండడంతో...
హరినా«థ్ భార్య శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు బీట్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చర్ల మండలంలో పనిచేసినప్పుడు లింగాపురానికి చెందిన జర్నలిస్టు కొండా కౌషిక్‌తో పరిచయం ఏర్పడి..అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో హరినాథ్‌ను హత్య చేయాలని పథకం పన్నింది.
ఈనెల 15వ తేదీన హరినా«థ్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా కౌషిక్‌కు శ్రుతిలయ సమాచారం ఇచ్చింది. ఆయన తనతోపాటు ఏపీలోని ఏటపాక రాయన్నపేటకు చెందిన బంధువు డేగల భాను, చర్లకు చెందిన స్నేహితుడు చెన్నం మోహన్‌ను తీసుకొచ్చాడు. నిద్రలో ఉన్న హరినాథ్ గొంతు నులిమి హత్య చేశాక స్లాబ్ హుక్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు.
పోలీసుల విచారణలో విషయం బయటపడడంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ సతీశ్‌కుమార్, ఎస్‌ఐలు సుమన్, జీవన్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.


