నేడు ఆస్ట్రేలియాతో భారత్ చివరి వన్డే
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా
ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సిడ్నీ: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ విజేత హోదాలో భారీ అంచనాలతో ఆ్రస్టేలియాకు వచ్చిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే 0–2తో సిరీస్‌ను కోల్పోయింది. మిగిలిన చివరి మ్యాచ్‌లోనైనా గెలిస్తే టీమిండియాకు ఊరట దక్కుతుంది.
భారత జట్టు తమ వన్డే చరిత్రలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురి కాలేదు. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కొత్త కెపె్టన్ శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో అలాంటి అవకాశం ఇవ్వరాదని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది.
కోహ్లి ఈసారైనా...
సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలి మ్యాచ్‌లో విఫలమైనా...అడిలైడ్‌లో అర్ధసెంచరీతో రోహిత్ కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే అతని ఆటలో సహజశైలి, దూకుడు కనిపించలేదు. కోహ్లి అయితే రెండు సార్లూ డకౌట్ అయి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా సహజంగానే వారిద్దరి బ్యాటింగ్‌పైనే అందరి దృష్టీ నిలిచింది.
గతేడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆ్రస్టేలియా గడ్డపై ఆడటం ఇదే చివరిసారి కానుంది. అందుకే ఈ మ్యాచ్‌పై సిడ్నీ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయి మైదానం హౌస్‌ఫుల్‌గా కనిపించనుంది.
కోహ్లి తన స్థాయికి తగినట్లు ఆడి ఆకట్టుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవుతుండటం భారత్ బృందానికి ఆందోళన కలిగించే అంశం. మరోసారి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కీలకం కానుండగా... ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో ఈ మ్యాచ్‌లోనైనా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.
వారిద్దరికి విశ్రాంతి...
అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైనా... ఆసీస్ యువ క్రికెటర్లు రెండో వన్డేను గెలిపించడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉత్సాహాన్ని ఇచి్చంది. షార్ట్, కనోలీ, ఒవెన్, రెన్‌షాలాంటి ఆటగాళ్లంతా ప్రభావం చూపించగలిగారు. బౌలింగ్‌లో బార్త్‌లెట్ ఆకట్టుకోగా, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన విలువను ప్రదర్శించాడు.
ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో టాప్ పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌లకు ఆసీస్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో ఎలిస్, జాక్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగుతారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఆ్రస్టేలియా ఇక్కడ ఆడిన గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.
16 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 19 వన్డేలు జరిగాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక వన్డేలో ఫలితం రాలేదు.


