ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల సరికొత్తగా 'ట్రావెలింగ్ సోల్జర్' పేరుతో మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. విశ్వవేదికలపై తెలుగు పాటలను ప్రెజెంట్ చేయనున్నారు.
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో రమణ గోగులతో పాటు ఎక్సెల్ గ్లోబల్ సర్వీస్ ఎండీ రామ్, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ... ఈ వరల్డ్ టూర్ వివరాలు వెల్లడించారు.


